Advertisement

Main Ad

Dry Fruits Laddu

Dry Fruits Laddu


తయారికి కావలసిన పదార్థాలు :

  1. ఖర్జూర పేస్టు : 2 కప్పు
  2. అంజిర్ : 1 కప్పు
  3. కాజు : 1 కప్పు
  4. బాదం : 1 కప్పు
  5. పిస్తా  : 1 కప్పు
  6. కిస్మిస్ : 1 కప్పు
  7. ఎండు కొబ్బరి తురుము : 1 కప్పు
  8. గసాల : 5 స్పూన్స్
  9. బెల్లం : 1 కప్పు 
  10. నెయ్యి : 1 కప్పు

తయారి చేయు విధానం :

  • స్టవ్ ఫై కడాయి పెట్టి నెయ్యి వేసి కాజు, కిస్మిస్, బాదాం, పిస్తా వేసి బాగా వేయించి పక్కన పెట్టాలి.
  • తరువాత కొబ్బరి తురుము, గసాల కూడా వేసి బాగా వేయించి పక్కన పెట్టాలి.
  • కాజు, బాదాంను కొంచెం మిక్స్ పట్టి పక్కన పెట్టుకోవాలి.
  • అదే కడాయి లో వేయించిన వాటిని అన్నింటిని వేసాక ఖర్జూర పేస్టు, అంజిర వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి, కొంచెం చల్లారక చేతులకు నెయ్యి రాసి వాటిని లడ్డూలుగా చేసి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
  • అవసరం అనుకుంటే బెల్లం కూడా పాకం పట్టి పోసుకోవచ్చు.
  • ఈ లడ్డులు పిల్లలకు చాల బలాన్ని ఇస్తాయి.