Advertisement

Main Ad

Snake gourd Masala Curry | పొట్లకాయ మసాలా కూర | Gourd Recipe

Snake gourd Masala Curry । పొట్లకాయ మసాలా కూర


తయారికి కావలసిన పదార్థాలు :

  1. పొట్లకాయ : 200 గ్రా
  2. ఉల్లిగడ్డ : 2
  3. బాదాం పొడి : 4 స్పూన్స్
  4. నువ్వుల పొడి : 4 స్పూన్స్
  5. గరం మసాలా పొడి : 1 స్పూన్
  6. ధనియాల పొడి : 1 స్పూన్
  7. ఎండు కొబ్బరి పొడి : 4 స్పూన్
  8. పసుపు, ఉప్పు, కారం : తగినంత
  9. కరివేపాకు, కొత్తిమిర
  10. నూనె
  11. జీలకర్ర, ఆవాలు : 1 స్పూన్
  12. అల్లం వెల్లులి పేస్టు : 1 స్పూన్

తయారు చేయు విధానం :

  • పొట్లకాయను కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి కట్ చేసిన పొట్లకాయను వేసి కొంచెం పసుపు, చిటికెడు ఉప్పు వేసి ఉడికించి నీళ్ళు వడపోసి పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్ ఫై పాన్ పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన ఉల్లిగడ్డలను వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఉడికించిన పోట్లకాయలను వేసి చిటికెడు పసుపు కూడా వేసి కలుపుకోవాలి.
  • 5 నిమిషాల తరువాత బాదాం పొడి, నువ్వుల, కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకున్న తరువాత కూరకి తగినంత ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి అవసరం ఐతే కొన్ని నీళ్ళు పోసుకోవాలి.
  • ఇలా మగ్గుతున్న కూరలో గరం మసాలా, ధనియాల్ పొడి, కొత్తిమిరను వేసి కలుపుకోవాలి.
  • 2 నిమిషాల తరువాత స్టవ్ కట్టేయాలి.