Advertisement

Main Ad

Stuffed Ridge Gourd Recipe | Ridge Gourd

Stuffed Ridge Gourd Recipe | గుత్తి బీరకాయ శాకం


తయారికి కావలసిన పదార్థాలు :

  1. బీరకాయ : 200 గ్రా
  2. నువ్వులు : 5 స్పూన్స్
  3. పల్లీలు: 5 స్పూన్స్
  4. ఎండు కొబ్బరి పొడి : 4 స్పూన్స్
  5. వెల్లులి రిబ్బలు : 6
  6. చింతపండు : 1/2 కప్పు
  7. ఆవాలు , జీలకర్ర : 1 స్పూన్
  8.  నూనె 
  9. కరివేపాకు, కొత్తిమిర
  10. పసుపు , ఉప్పు , కారం : తగినంత
  11. ధనియాల పొడి : 1 స్పూన్
  12. గరం మసాలా పొడి : 1/2 స్పూన్

తయారి చేయు విధానం:

  • బీరకాయను కొద్దిగా పొట్టు తీసి కడిగిన తరువాత మసాలా నింపే విధంగా బీరకాయను కట్ చేసుకొని పక్కనపెట్టుకోవాలి.
  • మసాలా తయారికి మిక్స్ జార్ లో పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, వెల్లులి రిబ్బలు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, చింత పండు వేసి మిక్స్ చేయాలి కొద్దిగా నీళ్ళు పోసి కలిపి మరో సారి మిక్స్ చేసుకొని ముద్దను పక్కన పెట్టుకోవాలి.
  • కట్ చేసిన బీరకయలొ మసాలా ను నింపి పెట్టుకోవాలి.
  • స్టవ్ ఫై కడాయి పెట్టి 5 స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక ఆవాలు , జీలకర్ర , కరివేపాకు వేసి వేగాక మసాలా నింపిన బీరకయలను వేసి మిగిలిన మాసాలను కూడా అందులోనే వేయ్యాలి.
  • కొద్దిగా నీళ్ళు పోసి బాగా మగ్గనివ్వాలి, చివరగా కొత్తిమిరను చల్లి స్టవ్ కట్టేయాలి.